Monday, June 1, 2009

కథ

కోతి తెలివి

సి. విజయేంద్ర బాబు

ఒక ఊరిలో ఒక కోతి ఉంది. అది చాలా తెలివైనది. అది ఒక పెద్ద మర్రిచెట్టు ఎక్కింది. అది మర్రి తొర్రను చూసింది. దానిలో పక్షులు కవకవ అరుస్తున్నాయి. ఎందుకు అరుస్తున్నాయా అని చూసింది. ఒక పాము చెట్టుపైకి ఎక్కడం చూసింది. కొమ్మపై కూర్చున్న గద్దను పిలిచింది.


"నీకు పామంటే ఇష్టం కదా" అంది.


" అవును" అంది గద్ద.


"మరి తిను" అంది కోతి.


గద్ద పామును పట్టుకొని ఎగిరింది. ఆవిధంగా కోతి తెలివితో పక్షి పిల్లల్ని కాపాడింది.


చేతకాని వారిని కష్టాలనుండి తప్పించడం మంచి గుణం.

(సాహితి లో బాలసాహితి శీర్షికన ఈ కథ 4 ఆగస్ట్ 2008 న ప్రచురితమైనది)

No comments:

Post a Comment