Saturday, May 29, 2010

చిన్న కథ - సాహసబాలుడు

సాహసబాలుడు


అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒకసారి ఒక సంఘటన జరిగింది. అది ఏమిటంటే ఒకసారి పక్క ఊరినుండి ఒక స్కూలు పిల్లలు ఆ ఊరికి విహారయాత్రకు వచ్చారు. వాళ్ళు అల్లరి పిల్లలు. వారిలో ఒకడు వాళ్ళ గుంపు నుండి విడిపోయి పక్కకి వచ్చి ఆ ఊరిలో ఉన్న చెరువు వద్దకు వెళ్ళి ఆడుకుంటుండగా అక్కడికి ఒక పాము వచ్చింది. ఆ పాముని చూడగానే ముందర చెరువు ఉందన్న సంగతి మరచి పరిగెత్తుతూ వెళ్ళి చెరువులో పడిపోయాడు. అక్కడికి దగ్గరలో పశువులు మేపుతున్న ఒక బాలుడు అది చూసి, వాడు మునిగిపోక ముందే బయటకి లాగి కాపాడాడు. తరువాత జరిగిన విషయాన్ని వాళ్ళ టీచర్లతో చెప్పి, వాన్ని వాళ్ళకప్పగించాడు. ఆ పశువుల కాపరి బాలుని సాహసాన్ని అందరూ మెచ్చుకున్నారు. ప్రమాదంలో ఉన్నవారిని కాపాడటం మంచి అలవాటు.
జరిగిన పొరపాటుకు టీచర్లు బాధపడి, తమ తప్పును కూడా తెలుసుకున్నారు. పిల్లలందరికీ క్రమశిక్షణ నేర్పి వాళ్ళను చక్కగా నడుచుకునేట్టు చేశారు.

(సాహితి లో బాలసాహితి శీర్షికన ఈ కథ 29 మే 2010 న ప్రచురితమైనది)

చిన్న కథ - తెలివైన శిల్పి

తెలివైన శిల్పి

ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు వాడు. తనలాంటి శిల్పాలను ఎన్నో చెక్కాడు. చాలా సంవత్సరాల తరువాత అతడికి ఒక ఆలోచన వచ్చింది. తనలాంటి మాట్లాడేశిల్పాన్ని తయారు చేసాడు . కొన్ని సంవత్సరాల తరువాత, మృత్యువు తనను వెంటాడసాగింది. శిల్పి తనను తాను కాపాడుకోవటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తను చెక్కిన శిల్పాల మధ్య నిలుచుకున్నాడు. అప్పుడు అతనిని పట్టుకోడానికి మృత్యుదేవత ఒక ఉపాయము ఆలోచించి, “ఆహా! ఎవరీ శిల్పి” అంది. శిల్పి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడు తను చెక్కిన ఆ మాట్లాడే శిల్పం నేనే ఆశిల్పిని అంది. అప్పుడు మృత్యువు ఆ శిల్పాన్ని తన వెంట తీసుకొని వెళ్ళింది. శిల్పి ఎన్నో రోజులు ఆనందంగా జీవించాడు.

(సాహితి లో బాలసాహితి శీర్షికన ఈ కథ 3 ఏప్రెల్ 2010 న ప్రచురితమైనది)